English | Telugu

చిరంజీవి, పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్..!

మెగా బ్రదర్స్ చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది?. అసలు ఆ కాంబినేషన్ ఊహిస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. వీరిద్దరూ మల్టీస్టారర్ ఫిల్మ్ చేస్తే బాక్సాఫీస్ షేక్ అవుతుంది అనడంలో డౌట్ లేదు. అందుకే వీరి కాంబో సినిమా కోసం మెగా అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం.

చిరంజీవి వెండితెరపై కనిపించిన తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు' విడుదలై సెప్టెంబర్ 22కి 47 సంత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ చిత్రం తనకి నటుడిగా ప్రాణం పోసి, తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందేలా చేసిందని చిరంజీవి అన్నారు.

తన అన్నయ్య చిరంజీవి నటించిన 'ప్రాణం ఖరీదు' సినిమా విడుదలై 47 సంత్సరాలు పూర్తయిన సందర్భంగా.. పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. పెద్దన్నయ్య హీరోగా నటించిన 'ప్రాణం ఖరీదు' విడుదలైన సమయంలో తాను స్కూల్లో ఉన్నానని, ఇప్పటికీ ఆ రోజులు కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు. అన్నయ్య సినీ ప్రస్థానం నిజంగా స్ఫూర్తిదాయకం అని కొనియాడారు.

పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కి రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన రిప్లై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మీ ఇద్దరు కలిసి సినిమా చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు సంతోషిస్తారని.. అది ఈ శతాబ్దానికి మెగా పవర్ ఫిల్మ్ అవుతుందని వర్మ ట్వీట్ చేశారు.

రామ్ గోపాల్ వర్మ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి మల్టీస్టారర్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.