English | Telugu

'చిన్నదాన నీ కోసం' సెన్సార్ రిపోర్ట్

నితిన్ లేటెస్ట్ చిత్రం 'చిన్నదాన నీ కోసం' సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో ఈచిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 25న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.నితిన్ సరసన బాలీవుడ్ భామ మిస్తీ హీరోయిన్ గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హ్యాట్రిక్ విజయాలతో సూపర్ ఫామ్ లో వున్న నితిన్.. చిన్నదాని సక్సెస్ పైకూడా కాన్ఫిడెంట్ గా వున్నాడు. కరుణాకరన్ విషయానికి వస్తే గత చిత్రం 'ఎందుకంటే ప్రేమంట'ఫలితం నిరాశ పరిచింది. ఆయన ఫామ్ లోకి రావాలంటే ఓ హిట్టు పడాలి. మరి ఆ విజయం చిన్నది ఇస్తుందో లేదో చూడాలి.