English | Telugu

మహేష్ బాబు "బిజినెస్ మ్యాన్" ప్రోమో గ్రేట్

మహేష్ బాబు "బిజినెస్ మ్యాన్" ప్రోమో గ్రేట్. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "బిజినెస్ మ్యాన్". మహేష్ బాబు "బిజినెస్ మ్యాన్" ఆడియో సాంగ్స్ ప్రోమో గ్రేట్ అని ప్రేక్షకులూ, సినీ వర్గాలు కూడా అంటున్నాయి. ఈ మహేష్ బాబు "బిజినెస్ మ్యాన్" ఆడియో విడుదల డిసెంబర్ 22 వ తేదీ, అంటే నేటి సాయంత్రం విడుదల కానుంది.

ఈ చిత్రం ఆడియో విడుదలకు విక్టరీ వెంకటేష్ ,ప్రభాస్, వి.వి.వినాయక్ అతిథులుగా రానున్నారని సమాచారం. "పోకిరి" వంటి రికార్డ్స్ సృష్టించిన చిత్రం తర్వాత పూరీ జగన్నాథ్, మహేష్ బాబుల కామబినేషన్ లో వస్తున్న చిత్రం ఇదే కావటంతో దిని మీద భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం సంక్రాంతి పండుగకు అంతే 2012 జనవరి 11 వ తేదీన విడుదల కానుంది. మహేష్ బాబు "బిజినెస్ మ్యాన్" ప్రోమో కూడా చక్కని ప్రేక్షకాదరణ పొందుతుంది.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.