English | Telugu

లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన మీనాక్షి.. ఇక అక్కడే ఉంటుందా?

ఇటీవలికాలంలో తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. లక్కీ భాస్కర్‌, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అంత పెద్ద హిట్‌ సినిమాల్లో నటించినా ఈ ఏడాది ఒక్క సినిమాలో కూడా ఆమెకు అవకాశం రాలేదు. దీంతో ఇక మీనాక్షి పని అయిపోయిందంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వినిపించాయి. అలా కామెంట్స్‌ వినిపిస్తున్న క్రమంలోనే మీనాక్షికి ఒక బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. అది కూడా బాలీవుడ్‌ సినిమాలో. దీంతో మీనాక్షి ఆనందానికి అవధుల్లేవు.

2011లో జాన్‌ అబ్రహం హీరోగా వచ్చిన ‘ఫోర్స్‌’ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 2016లో వచ్చిన ‘ఫోర్స్‌2’ కూడా విజయం సాధించింది. ఇప్పుడు ‘ఫోర్స్‌3’ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరిని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కెరీర్‌ ప్రారంభంలో అప్‌స్టేర్స్‌ అనే హిందీ సినిమాలో ఊరూపేరులేని క్యారెక్టర్‌ చేసింది. దాంతో తనకు తెలుగు చిత్ర పరిశ్రమ కరెక్ట్‌ అని భావించి టాలీవుడ్‌లో ప్రయత్నాలు ప్రారంభించి సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ అనిపించుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంటర్‌ అవుతున్న మీనాక్షి.. ఫోర్స్‌3 రిజల్ట్‌ని బట్టి బాలీవుడ్‌లోనే ఉండిపోవాలా లేక తిరిగి టాలీవుడ్‌ రావాలా అనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.