English | Telugu
బ్రహ్మానందం బయటపెట్టాడు..!!
Updated : Nov 12, 2014
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం సినిమా ప్రపంచంలోకి రాకముందు లెక్చరర్ గా పనిచేసిన విషయం అందరికి తెలిసిందే. లేటెస్ట్ గా బ్రహ్మానందం ఆయనలో వున్న మరో టాలెంట్ ని బయటపెట్టారు. సాధారణంగా బ్రహ్మీకి ఖాళీ సమయం దొరికేది చాలా తక్కువేనని చెప్పాలి ఎందుకంటే ప్రతి సినిమాలోనూ ఆయన వుంటాడు కాబట్టి. ఇటీవల ఆయనకు దొరికిన కొంత ఖాళీ సమయంలో ఆయనలోని శిల్ప కళాకారుడు బయటకువచ్చాడు. అంతే వెంటనే బంక మట్టితో రవీంద్రనాథ్ ఠాగూర్ శిల్పాన్ని తయారు చేసి దానికి సంబంధించిన ఫోటోలను ఫేస్ బుక్ లో తాజాగా బయటపెట్టారు. అంతే ఇక చూడండి ఈ పోస్ట్ కి లైక్ లు, షేర్ లు, కామెంట్ లు మొత్తం బ్రహ్మీ హావా నడుస్తోంది ఇప్పుడు. మీరు కూడా ఈ ఫోటోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.