English | Telugu
మెగాస్టార్ బర్త్ డేలో బాలీవుడ్ హంగామా
Updated : Aug 20, 2015
మెగాస్టార్ చిరంజీవి 60వ బర్త్ డేనిఅంగరంగ వైభవంగా నిర్వహించాలని ఆయన ఫ్యామిలీ మెంబర్స్ నిర్ణయించుకున్నారు. ఫ్యాన్స్ కోసం ఒక కార్యక్రమంతోపాటు.. బడాబాబులు, సెలబ్రిటీల కోసం స్టార్ హోటల్లోనూ ఒక పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి టాలీవుడ్ ప్రముఖులతో పాటు బాలీవుడ్ బడా స్టార్స్ కూడా విచ్చేస్తున్నట్లు టాక్. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ లకు ఇప్పటికే ఆహ్వానాలందాయి. ఇక ఇటు రజనీకాంత్, శివరాజ్‌కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్లు విచ్చేస్తున్నారు కూడా. వీరితోపాటు అనేకమంది రాజకీయ నేతలు కూడా చిరు బర్త్ డే పార్టీకి హాజరు కానున్నారు. అటు పాలిటిక్స్, ఇటు సినిమాలు.. రెండు రంగాలకు చెందిన ప్రముఖులు ఒకే వేదికగా కలవడం... ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతా మెగాస్టార్ మహిమ.