English | Telugu
ఆ నటుడిని పెళ్లి చేసుకున్న రేష్మి..!
Updated : Apr 23, 2016
సందీప్ కిషన్ రన్ సినిమాలో విలన్ గుర్తున్నాడా. తమిళంలో జిగర్తాండా సినిమాతో ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్న అతని పేరు బాబీ సింహా. తాజాగా తిరుపతిలో తన గర్ల్ ఫ్రెండ్ రేష్మీ మీనన్ ను పెళ్లాడాడు ఈ నటుడు. రేష్మీ బాబీ కలిసి ఉరుమీన్ అనే సినిమాలో నటించారు. గత కొన్నేళ్లుగా బాబీకి, రేష్మికి మధ్య ప్రేమకథ నడుస్తోంది. మొదట ఇద్దరి ఇళ్లల్లో వ్యతిరేకత వచ్చినప్పటికీ చివరికి అందర్నీ ఒప్పించి పెళ్లిచేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఈ జంట, ఈ నెల 24న చెన్నైలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు.