English | Telugu
ఓటీటీలోకి 'భూతద్దం భాస్కర్ నారాయణ'..!
Updated : Mar 14, 2024
శివ కందుకూరి, రాశి సింగ్ ప్రధాన పాత్రల్లో పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'భూతద్దం భాస్కర్ నారాయణ'. శివ కందుకూరి డిటెక్టివ్ గా కనిపించిన ఈ కామెడీ థ్రిల్లర్ మార్చి 1న థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ నే తెచ్చుకుంది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
'భూతద్దం భాస్కర్ నారాయణ' ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా దక్కించుకున్నట్లు సమాచారం. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా లాక్ అయినట్లు వినికిడి. మార్చ్ 29 నుంచి ఓటీటీలో ఈ చిత్రం అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అంటే థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలోకి అడుగుపెడుతోంది అన్నమాట.
మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, విజయ సరాగ ప్రొడక్షన్స్ బ్యానర్లపై స్నేహాల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముదుంబి ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవి ప్రసాద్, షఫీ, శివన్నారాయణ, వెంకటేష్, సురభి తదితరులు నటించిన ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. సినిమాటోగ్రాఫర్ గా గౌతమ్, ఎడిటర్ గా గ్యారీ వ్యవహరించారు.
