English | Telugu

ఆ రోజు ఫ్యాన్ గా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళాను..ప్రేమలు హీరోయిన్

ఆ రోజు ఫ్యాన్ గా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళాను..ప్రేమలు హీరోయిన్

మొన్నీ ఈ మధ్యనే ప్రేమలు మూవీ వచ్చింది. మూవీ చూసిన ఎవరికైనా ఒక డౌట్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. అదేంటంటే  హీరోయిన్ మమిత కి తెలియకుండా ఆమె  లైఫ్ జర్నీ నే సినిమాగా తీసారా అని. ఇది నిజం అని  ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. అంతలా తన క్యారక్టర్ ద్వారా మమిత  మెస్మరైజ్ చేసింది. చిన్న చిన్న ఎక్సప్రెషన్స్ లో సైతం చాలా క్యూట్ గా నటించి కుర్రకారు మతులు పోగొట్టింది. తాజాగా  అల్లు అర్జున్ ఉరఫ్ బన్నీ గురించి ఆమె చేసిన  వ్యాఖ్యలు టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచాయి.

ప్రేమలు సక్సెస్ మోడ్ లో ఉన్న మమిత ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె మాట్లాడుతు నేను అల్లు అర్జున్ కి వీరాభిమానినని చెప్పింది. ఆయనకి  నేషనల్ అవార్డు వచ్చిన సమయంలో హైదరాబాద్ లోనే ఉన్నానని  అవార్డు వచ్చిందని తెలియగానే ఇంటికి వెళ్లి బన్నీ ని చూశానని  చెప్పింది. హ్యాపీ, ఆర్య , ఆర్య 2 ,ఇద్దరమ్మాయిలతో , రేసుగుర్రం తన ఫేవరేట్ మూవీలని తన తమ్ముడికి బన్నీ అంటే చాలా ఇష్టమని ఆయన డ్రెస్ స్టైల్ నే ఫాలో అవుతాడని తెలిపింది. ఇప్పుడు ఆమె చెప్పిన ఈ మాటలు  సోషల్ మీడియాలో ఫుల్  వైరల్ అవుతున్నాయి. బన్నీ ఫ్యాన్స్ అయితే  మమిత మాటలతో  ఫుల్ ఖుషీలో ఉన్నారు. అలాగే బన్నీ మమిత ని  చూశాడో లేదో తెలుసుకోవాలనే  ఆసక్తి కూడా వాళ్లలో ఉంది. బన్నీ ఆమె మాటలకి ఎలా స్పందిస్తాడో చూడాలి.

ఇక  మమిత బైజు స్వచ్ఛమైన మలయాళ అమ్మాయి .దీంతో  బన్నీ కి మలయాళంలో  ఉన్న క్రేజ్ మరోసారి అర్ధమైంది.  ప్రేమలు తో సక్సెస్ తో మమిత కి అన్ని బాషల్లోను వరుస ఆఫర్ లు వస్తున్నాయి. కానీ ఆమె వెంట వెంటనే సినిమాలు ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతం తమిళంలో ఒక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి.