English | Telugu
మా గామిని కూడా సపోర్ట్ చెయ్యండి..తెలుగు కదా
Updated : Mar 14, 2024
విభిన్న కధాంశంతో కూడిన చిత్రాలు చేసుకుంటు వెళ్లే హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకడు. మొన్న శివరాత్రికి గామి తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద ఇంతవరకు రానటువంటి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తో ఆ మూవీ తెరకెక్కింది.అలాగే మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా గామి వండర్ కి ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో విశ్వక్ సేన్ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ గా నిలిచాయి.
ఇండస్ట్రీ పెద్దలు గామిని చూసి సపోర్ట్ చేయాలి. అదే టైం లో నాలుగు మంచి మాటలు కూడా చెప్పాలి. అలా మీరు చెయ్యటం వలన గామికి ఎంతో ఉపయోగం.పైగా ఇది మన తెలుగు సినిమా. ఇంతవరకు తెలుగులో ఇలాంటి సినిమా రాలేదు.ఇప్పుడు ఈ మాటలన్నీ విశ్వక్ సేన్ తన గామి గురించి చెప్పుకొస్తున్నాడు. అలాగే ఎవరు ఎన్ని అనుకున్నా ప్రేక్షకులు కొన్ని దశాబ్దాలు తర్వాత కూడా గామి గురించి మాట్లాడుకుంటారని కూడా అంటున్నాడు. మరి విశ్వక్ సేన్ మాటలు విన్న సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.
హిమాలయాల్లో ఎక్కువ భాగం షూటింగ్ ని జరుపుకున్న గామి కోసం విశ్వక్ సేన్ చాలా కష్టపడ్డాడు. పగలు రాత్రి అనే తేడా లేకుండా షూటింగ్ లో పాల్గొన్నాడు.తినడానికి తిండి తాగడానికి మంచి నీళ్లు కూడా లేకుండా షూటింగ్ లో పాల్గొన్నాడు. చాందిని చౌదరి కూడా విశ్వక్ సేన్ లాగా చాలా కష్టాలు పడింది. ఇప్పుడు ఆ ఇద్దరి నటనకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. క్లౌన్ పిక్చర్స్, కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ లు నిర్మించగా విద్యాధర్ కాగిత దర్శకుడుగా వ్యవహరించాడు. ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ రిలీజ్ చేసింది.
