English | Telugu

హీరోయిన్ నడుముని పబ్లిక్ లో పట్టుకున్న అగ్ర హీరో.. అభిమానులు ఎటు వైపు!  

'సినిమా'(Cinema)అనేది ప్రేక్షకులకి పూర్తి స్థాయి ఎంటర్ టైన్ మెంట్ ని అందించే ఉద్దేశ్యంతో చిత్రీకరణ జరుపుకుంటుంది. కథ డిమాండ్ ప్రకారం అందులోని సన్నివేశాలు తెరకెక్కుతు ఉంటాయి. సదరు సన్నివేశాల్లో హీరో, హీరోయిన్ దగ్గర్నుంచి, ఇతర క్యారక్టర్ ల మధ్య రొమాన్స్ సీన్స్ ఉన్నా, అవి సినిమా వరకే పరిమితం. కానీ అందుకు భిన్నంగా 'భోజ్ పూరి' స్టార్ హీరో 'పవన్ సింగ్' ప్రవర్తించాడు.

రీసెంట్ గా 'ఉత్తర ప్రదేశ్' క్యాపిటల్' లక్న'(Lucknow)లో ఒక మూవీ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ సింగ్(Pawan Singh)తో పాటు హీరోయిన్ అంజలీ రాఘవ్(Anjali Raghav) ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. అంజలి మాట్లాడుతున్న సమయంలో పవన్ సింగ్ స్టేజ్ పైనే ఉండి, అంజలి నడుముని పదే పదే పట్టుకోవడం స్టార్ట్ చేసాడు . అంజలి తన కోపాన్ని బయటపెట్టకుండా నవ్వుతూనే వారిస్తుంది. కానీ ఏదో అంటుకుందని నడుముని తాకుతూనే ఉన్నాడు. ఆ సందర్భంలో అంజలి చాలా అసౌకర్యానికి గురైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో, పవన్ పై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకొవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. స్టేజ్ కింద ఉన్న వాళ్ళు సైతం షాకింగ్ కి గురవ్వగా, ప్రోగ్రాం అవ్వగానే పవన్ సింగ్ తో అంజలి సీరియస్ అయినట్టు తెలుస్తుంది.

2007 లో సినీ రంగ ప్రవేశం చేసిన పవన్ సింగ్ అనతి కాలంలోనే ఎన్నో హిట్స్ ని అందుకొని భోజ్ పూరి భాషలో నెంబర్ వన్ స్టార్ గా ఎదిగాడు. సింగర్ గాను సత్తా చాటిన పవన్ తన కెరీర్ లో ఇప్పటి వరకు సుమారు 70 కి పైగా చిత్రాల్లో నటించాడు. గత ఏడాది 'జియో మేరీ జాన్' అనే మూవీతో విజయాన్ని అందుకున్నాడు. అంజలికి భర్కమ, ఉదాన్ జిందగీ కీ, ఉద్దాదే ఆఫ్వా, వంటి చిత్రాలు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. హరన్వి మ్యూజిక్ వీడియోస్ తో బాగా పాపులర్ అయ్యింది.




అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.