English | Telugu
బన్నీ బ్యూటీ తమిళ తంబీలను మెప్పిస్తుందా?
Updated : Jun 11, 2015
మెగా ఫ్యామిలీ హీరోతో ఎంట్రీ ఇచ్చింది కదా....మ్యాజిక్ చేస్తుందనుకుంటే అడ్రస్ లేకుండా పోయింది భానుశ్రీ మెహ్రా. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడడంతో అమ్మడిని పట్టించుకునే నాధుడే లేడు. ఆ ఒక్క సినిమాతోనే ఐరెన్ లెగ్ అని ముద్రవేయించుకున్న భానువైపు ఎవ్వరూ కన్నెత్తి చూడలేదు. అందులోనూ ఫిగర్ కూడా పెద్దగా బాగోదాయె. దీంతో అసలు బానుశ్రీ మెహ్రా అనే భామ ఉందనే మాట మరిచారంతా.
అప్పుడప్పుడు చిన్న చిన్న సినిమాల్లో కనిపించినా ఆమె ఫేట్ మారలేదు. దీంతో ఇక టాలీవుడ్ కో నమస్కారం అంటూ కోలీవుడ్ కి చెక్కేసింది. తమిళ చిత్రం సింబలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. బాయ్స్ హీరో భరత్ తో రొమాన్స్ చేయనుంది. ఈ ఆఫర్ సంగతి పక్కనపెడితే...టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించలేకపోయిన భాను...కోలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అని డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే తెలుగులో ఆదరణ దక్కని ముద్దుగుమ్మలు తమిళంలో దూసుకుపోతున్నారని కొందరంటున్నారు. మరి భాను కెరీర్ కోలీవుడ్ లో ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ.