English | Telugu
లారెన్స్ తో బండ్ల గణేష్ దోస్తీ
Updated : Feb 21, 2016
టెంపర్ తో ఓ మాదిరి హిట్ ఎకౌంట్ లో పడినా, బండ్ల గణేష్ పూర్తి స్థాయి ప్రాఫిట్లు చూడలేకపోయాడు. తర్వాత చాలా ప్రాజెక్టులు అనుకున్నా ఏవీ పట్టాలెక్కలేదు. మళయాళ సినిమాలు రీమేక్ లు చేయడం ట్రెండ్ గా మారడంతో, టూ కంట్రీస్ సినిమా రైట్స్ ను కొన్నాడు. ఈ ప్రాజెక్ట్ కు విక్టరీ వెంకటేష్ ను అనుకుంటున్నట్టు సమాచారం. లేటెస్ట్ గా రాఘవ లారెన్స్ తో కలిసి సినిమా తెరకెక్కించే పనిలో పడ్డాడు బండ్ల గణేష్. లారెన్స్ కేవలం హార్రర్ కామెడీ సినిమాలు తీసుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో, బండ్ల గణేష్ తో చేయబోయేది ఆ తరహా సినిమాయేనని, కాంచనకు సీక్వెల్ అని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు భైరవ అని టైటిల్ కూడా అనౌన్స్ చేశాడు. మరి లారెన్స్ తోనైనా బండ్లగణేష్ నిర్మాతగా ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.