English | Telugu
బాలయ్య, ఎన్టీఆర్ కలుస్తున్నారోచ్!
Updated : Nov 8, 2014
నందమూరి అభిమానులకు ఇంతకంటే శుభవార్త ఏముంటుంది.?? అటు బాలయ్య, ఇటు ఎన్టీఆర్ వాళ్లకు రెండు కళ్లు. వీరిద్దరూ గత కొంతకాలంగా ఎడమెహం, పెడమొహంగా ఉంటున్నారు. ఎట్టకేలకు వీరిద్దరు కలవబోతున్నారు. అదెలాగంటారా..?? హుద్ హుద్ బాధితులకు బాసటగా నిలవడానికి తెలుగు చిత్ర పరిశ్రమ `మేము సైతం` అనే ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. తెలుగు సినీరంగమంతా ఏకమై, వినోద కార్యక్రమాల్ని నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమం ద్వారా సమకూరే ఆదాయాన్ని హుద్ హుద్ బాధితులకు విరాళంగా ఇవ్వబోతోంది. అగ్ర హీరోలు, కొత్త - పాతతరం నటీనటులు, సాంకేతిక నిపుణులు అంతా ఈ వినోద కార్యక్రమంలో పాలుపంచుకోబోతున్నారు. నలుగురైదుగురు నటులు కలసి ఓ స్కిట్ వేయబోతున్నారట. ఇలా కనీసం పది స్కిట్లు వేసి, ప్రేక్షకులకు వినోదం పంచబోతున్నారని తెలిసింది. ఓ స్కిట్‌లో నందమూరి హీరోలు కలసి నటించే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. ఈ స్కిట్లో బాలకృష్ణ, ఎన్టీఆర్‌లు కూడా నటిస్తారని తెలుస్తోంది. అదే జరిగితే... అభిమానులకు కనుల పండగే!! వీరిద్దరినీ ఎలాగైనా ఒప్పించి ఓ స్కిట్ వేయించాలని ''మా'' విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.