English | Telugu

బాల‌య్య‌ని బాగా వాడుకొన్నాడు

ఇది వ‌ర‌కు ఎన్టీఆర్ మాట్లాడితే బాబాయ్‌.. తాత‌య్య అనేవాడు. ఇప్పుడు ఆ ప‌ల‌వ‌రింత‌లూ క‌ల‌వ‌రింత‌లూ లేవు. అస‌లు బాబాయ్‌తో స‌యోధ్యే లేదు. అలాంట‌ప్పుడు ఆ ఊసెందుకు ఎత్తుతాడులెండి! అయితే ఇప్పుడా బాధ్య‌త నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ తీసుకొన్నాడు. ఈయ‌న సినిమాల్లోనూ ర‌క్తం గురించీ, వంశ చ‌రిత్ర గురించీ భారీ డైలాగులు ఉంటాయి గానీ.. ఎన్టీఆర్‌క‌లా పేర్ల ప్ర‌స్తావ‌న‌కు పోలేదు. కానీ... ఇప్పుడు బాబాయ్‌నీ, తాత‌య్య‌నీ భ‌లే వాడేసుకొంటున్నాడు క‌ల్యాణ్‌రామ్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ, నిర్మించి చిత్రం ప‌టాస్‌. ఈ ట్రైట‌ర్ ఇప్పుడు నెట్ ప్ర‌పంచంలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. క‌ల్యాణ్ రామ్ బాడీ లాంగ్వేజ్‌, అత‌ని చేష్ట‌లూ చూస్తుంటే పెద్దాయ‌న్నో, లేదంటే బాల‌కృష్ణ బాబాయ్‌నో అనుక‌రిస్తున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపించింది. అంతేకాదు.. చివ‌ర్లో బాల‌య్య క‌టౌట్ ద‌గ్గ‌ర విజిల్ వేసి.. క‌ట్ చేశాడు. అంటే అర్థం ఏమిట‌ట‌..?? బాల‌య్య అభిమానులూ... న‌న్నూ ఆశీర్వ‌దించండి అనే క‌దా..? అస‌లు క‌ల్యాణ్ రామ్‌కి హిట్లు లేవాయె. దానికి తోడు ఎన్టీఆర్‌కి ప‌ట్టించుకోకుండా మానేసిన బాల‌య్య ఫ్యాన్స్‌కి మ‌రో హీరో కావాలె. అందుకే వాళ్ల దృష్టి క‌ల్యాణ్ రామ్‌పై ప‌డే ఛాన్సుంది. ఇలా సినిమాల్లోనూ, బ‌య‌టా బాల‌కృష్ణ జ‌పం చేస్తే... త‌న సినిమాకి వ‌సూళ్లు పెరిగే ఛాన్స్ ఎక్కువ‌గానే ఉంది. అందుకే ఈ రూటు ఫాలో అయిపోతున్నాడ‌న్న‌మాట‌. మొత్తానికి కల్యాణ్‌రామ్ మంచి స్కెచ్చే వేశాడు! మ‌రి ఈ ప‌టాస్ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో, బాల‌య్య అభిమానుల‌కు ఏమాత్రం న‌చ్చుతుందో చూడాలి.