English | Telugu

ఎన్టీఆర్ కండ‌లు చూసి ప‌డిపోయింది

త‌న కెరీర్‌లోనే తొలిసారి ష‌ర్టు విప్పి కండ‌లు చూపించాడు ఎన్టీఆర్‌. టెంప‌ర్‌లో ఎన్టీఆర్ స్టిల్స్ అభిమానుల‌కైతే విప‌రీతంగా న‌చ్చేశాయ్‌. ఎన్టీఆర్ కొత్త‌గా క‌నిపిస్తున్నాడంటూ మురిసిపోతున్నారు. ఫ్యాన్సుకి మాత్ర‌మే కాదు.. హీరోయిన్లూ ఈ స్టిల్స్ చూసి వావ్ అంటున్నారు. స‌మంత అయితే... ఎన్టీఆర్ కండ‌ల‌ను చూసి ఫ్లాట్ అయిపోయిన‌ట్టుంది. అందుకే త‌న ట్విట్ట‌ర్లో ''ఉమ్‌మ్‌... సూప‌ర్‌'' అంటూ ఎన్టీఆర్ పొటోల్ని పోస్ట్ చేసింది. అంటే.. ఈ స్టిల్స్ స‌మంత‌కు పిచ్చ పిచ్చ‌గా న‌చ్చేశాయ‌న్న‌మాట‌. హీరోయిన్లు హీరోల్ని పొగ‌డ్డం కొత్త కాదు. కానీ స‌మంత పొగిడిందంటే అందులో మేట‌ర్ ఉండి తీరుతుంది. ఎందుకంటే... ఇది వ‌ర‌కు స‌మంత కొన్ని కాంట్ర‌వ‌ర్సీ కామెంట్లు చేసింది. మ‌రీ ముఖ్యంగా మ‌హేష్ బాబు సినిమా `1` పోస్ట‌ర్‌పై బాహాటంగానే ఘాటుగా స్పందించింది. హీరోల ఆధిప‌త్యం మ‌రీ ఎక్కువైపోతోంద‌ని గ‌గ్గోలు పెట్టింది. అలాంటి స‌మంత‌కి ఓ హీరో న‌చ్చ‌డం, ఓ ఫ‌స్ట్ లుక్ మైండ్ బ్లాంక్ చేయ‌డం.. విచిత్ర‌మే. మొత్తానికి ఎన్టీఆర్‌కి స‌మంత ఇచ్చిన కాంప్లిమెంట్ల‌పై ఆస‌క్తి నెల‌కొంది. బుడ్డోడు ఎంత సంబ‌ర‌ప‌డుతున్నాడో..??