English | Telugu

'రూలర్'లో బాలకృష్ణ రెండో క్యారెక్టర్ ఏంటంటే?

'జై సింహా' విజయం తరవాత నటసింహం నందమూరి బాలకృష్ణ, తమిళ దర్శకుడు కె.ఎస్. రవికుమార్, నిర్మాత సి. కళ్యాణ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా 'రూలర్'. దీపావళి సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేశారు. అప్పుడు విడుదల చేసిన పోస్టర్లో బాలకృష్ణ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారనేది స్పష్టం చేశారు. లాఠీ పట్టుకోవాల్సిన పోలీస్ చేత భారీ సుత్తి పట్టించారు. దాంతో సినిమాలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందనేది అభిమానులకు ఒక ఐడియా వచ్చింది. పోలీస్ క్యారెక్టర్లో బాలకృష్ణ లుక్ మాసీగా ఉంది. ఈ లుక్ విడుదల చేయడానికి ముందు స్టైలిష్ లుక్ ఒకటి విడుదల చేశారు. మరి, అదేంటి? అంటే... ఐటీ ఆఫీసర్ లుక్.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒకరు పోలీస్ అయితే, మరొకరు ఐటీ ఆఫీసర్. ఇద్దరు పబ్లిక్ సర్వెంట్స్ అన్నమాట. బ్యాంకాక్, హైదరాబాద్ స్టూడియోల్లో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో ఐటీ ఆఫీసర్ సీన్స్ తీశారు. పోలీస్ సీన్స్ షూటింగ్ కోసం ఉత్తరాది రాష్ట్రాలు వెళ్లనున్నారు. రామోజీ ఫిలింసిటీలో కొన్ని సీన్స్ తీశారు. సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయనున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .