English | Telugu
ఒంగోలుకు అతిథిగా బాలయ్య
Updated : Dec 2, 2015
నందమూరి బాలకృష్ణ ఒంగోలుకు అతిథిగా రావడమెంటని ఆశ్చర్యపోతున్నారా? అక్కడే వుందండీ అసలు ట్విస్ట్!! బాలకృష్ణ ఒంగోలు రాబోతున్న మాట నిజమే కానీ ఒంగోలుకు అతిథిగా కాదు..ఒంగోలులో జరగబోయే సినిమా ఆడియో ఫంక్షన్ కి స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు. ఇది ఒంగోలులో వున్న నందమూరి అభిమానులకు శుభవార్తే అని చెప్పాలి.
ప్రస్తుతం రాజకీయాలు సినిమాలతో బిజీగా గడుపుతున్న బాలయ్య, అదీ ఇతర హీరో ఆడియో ఫంక్షన్ కోసం ఒంగోలు వరకు వస్తున్నాడంటే ఆ హీరో ఎంత లక్కీయో చెప్పొచ్చు. తన సొంత ఊరు ఒంగోలులో జరగబోయే ‘సౌఖ్యం’ సినిమా ఆడియో ఫంక్షన్ కు రావాలని గోపిచంద్ బాలయ్య కలిసి ఆహ్వానించగా ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ ఆడియో ఫంక్షన్ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాతలు. ఈ నెల 13న ‘సౌఖ్యం’ ఆడియో విడుదల కాబోతోంది. రెజీనా కథానాయికగా నటించిన ‘సౌఖ్యం’ క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.