English | Telugu

గౌతమీపుత్ర శాతకర్ణికి కథ ఇతనిదే..

నటసింహ నందమూరి బాలకృష్ణ 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి సంబంధించి రోజుకొక న్యూస్ బయటికొస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా, తన కెరిర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోయేలా రూపొందించాలనుకుంటున్నారు బాలయ్య. అందుకోసం కథ, కథనాల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. బాలకృష్ణ 100వ సినిమా అనేసరికి డైరెక్టర్ ఎవరు, కథ ఎలా ఉండబోతోంది అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అనేక తర్జన భర్జనల తర్వాత క్రిష్ దర్శకత్వంలో గౌతమీపుత్ర శాతకర్ణిని చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే స్పీడుగా లాంఛింగ్ కార్యక్రమం జరిగిపోయింది.

తెలుగుజాతి చరిత్రలో గొప్ప చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించిన పూర్తి చరిత్రను తెలుసుకునేందుకు దానిని ప్రజలకు అందించాలని బాలయ్య తాపత్రాయపడుతున్నారు. అందుకే మొన్న బౌద్ధ గురువులను తన ఇంటికి పిలిపించుకుని హిస్టరీ తెలుసుకుంటున్నారు. అయితే బాలయ్య ఆరు నెలల క్రితమే గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రను చేయాలనుకున్నారట. అందుకు తగ్గట్టుగానే శ్రీవెంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో సీనియర్ లెక్చరర్‌గా పనిచేసిన ఆచార్య రంగనాయకుల్ని సంప్రదించారట. ఆయన కూడా బాలయ్య అడిగిన వెంటనే పలు చారిత్రక అంశాలను పరిశీలించి శాతకర్ణికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించారు. ఆ కథను సినిమాకు తగ్గట్టుగా సిద్ధం చేసి దర్శకుడు క్రిష్‌కి అందజేశారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి బాలకృష్ణ స్వయంగా రంగనాయకులు గారిని ఆహ్వానించి సత్కరించారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.