English | Telugu
బాజీరావు అదరహో... అమితాబ్...
Updated : Dec 23, 2015
బాక్సాఫీసు దగ్గర అటూ ఇటుగా వున్నప్పటికీ ‘బాజీరావు మస్తానీ’ సినిమాకి బాలీవుడ్ ప్రముఖుల నుంచి మాత్రం ప్రశంసలు లభిస్తూనే వున్నాయి. మరాఠా యోధుడు బాజీరావు వీరోచిత పోరాటాలను చూసిన మత్తు నుంచి తాను ఇంకా బయటపడలేకపోతున్నానని, సినిమా అదరహో అని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అన్నారు. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రణవీర్ సింగ్, ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొనే నటించిన చిత్రం ‘బాజీరావు మస్తానీ’. మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో అమితాబ్ ఈ సినిమా యూనిట్‌ని అభినందించారు. బాజీరావు పాత్రలో నటించిన రణవీర్ సింగ్‌ని ఆలింగనం చేసుకుని మీర ప్రత్యేకంగా అభినందించారు.