English | Telugu
స్మిత ‘బాహుబలి’ కిలికి పాట
Updated : Dec 23, 2015
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి’ సినిమాలో కాలకేయ అనే విలన్ పాత్ర చేత ‘కిలికి’ భాషలో మాట్లాడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘బాహుబలి’ చిత్రానికి అభినందన గీతాన్ని పాప్ సింగర్ స్మిత రూపొందించింది. ఈ పాటను ‘కిలికి భాష’లో రాసి చిత్రీకరించారు. స్మిత, కాలకేయ పాత్రధారి ప్రభాకర్, డాన్సర్లు ఈ పాటలో నటించారు. ఈ పాటను సోషల్ మీడియా ద్వారా స్మిత అభిమానులతో పంచుకున్నారు.