English | Telugu
హమ్మయ్య.. బాహుబలి పూర్తయింది!
Updated : Apr 8, 2015
ఎట్టకేలకు బాహుబలి సినిమా షూటింగ్ పూర్తయ్యింది. రెండున్నర సంవత్సరాలుగా ఈ సినిమాని ఓ యజ్ఞంలా భావించి తెరకెక్కిస్తున్న రాజమౌళి కృషి ఫలించింది. బాహుబలికి మంగళవారం గుమ్మడికాయ్ కొట్టేశారు. ప్రభాస్, తమన్నాలపై తెరకెక్కించిన పాటలో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. అయితే... ఇప్పటికి ఫినిష్ అయ్యింది తొలి భాగం మాత్రమే. రెండో భాగంలో మరో 30 శాతం చిత్రీకరణ మిగిలిఉన్నట్టు సమాచారమ్. బాహుబలి 1 విడుదలైన తరవాత పార్ట్ 2 చిత్రీకరణ ప్రారంభిస్తారు. ఇప్పటి వరకూ ఈ సినిమాపై రూ.130 కోట్లు ఖర్చు పెట్టినట్టు టాక్. పార్ట్ 2లో మిగిలిన షూటింగ్ పూర్తిచేయడానికి మరో రూ.20 కోట్లయినా కావాలి. అంటే బాహుబలి మొత్తం బడ్జెట్ 150 కోట్లన్నమాట. మే 23న బాహుబలి విడుదల కావల్సివుంది. అయితే... ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మేనాటికి ఈ సినిమా వచ్చే అవకాశాల్లేవు. జూన్ చివరి వారంలోగానీ జులైలో గానీ బాహుబలిని విడుదల చేయవచ్చు.