English | Telugu

ప్ర‌భాస్ vs అమీర్ ఖాన్‌



బాహుబ‌లి 2 ఎప్పుడొస్తుంది? ఈ యేడాదా? వ‌చ్చే యేడాదా? ఈ అనుమానాల‌కు దాదాపు తెర‌ప‌డింది. బాహుబ‌లిని ఈ యేడాదే విడుద‌ల చేస్తాం....అని రాజ‌మౌళి క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా ఫిక్స‌యిన‌ట్టు తెలుస్తోంది. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌రు 25న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని రాజ‌మౌళి భావిస్తున్నార‌ట‌. అయితే.. అదే రోజున అమీర్‌ఖాన్ సినిమా దంగ‌ల్ కూడా విడుద‌ల అవ్వ‌నుంది. అంటే.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ర‌స‌వ‌త్త‌ర‌మైన పోటీ ఉంటుంద‌న్న‌మాట‌. నిజానికి ఓ బాలీవుడ్ సినిమాకీ టాలీవుడ్ సినిమాకీ పోటీ అనేదే ఉండ‌దు. కానీ.. బాహుబ‌లి అలాంటి సినిమా కాదు. తొలి భాగం బాలీవుడ్‌లోనూ విడుద‌లై... భారీ వ‌సూళ్లు ద‌క్కించుకొంది. అక్క‌డ పార్ట్ 2 గురించి కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారీ ఈ సినిమాని అక్క‌డ భారీగానే విడుద‌ల చేస్తారు. అమీర్‌ఖాన్ సినిమా అంటే ప్ర‌పంచ వ్యాప్తంగా ఆస‌క్తి ఉంటుంది. సో.. ఈసారి అమీర్‌కి గ‌ట్టిపోటీ త‌ప్ప‌ద‌న్న‌మాట‌.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.