Read more!

English | Telugu

బాలయ్య ప్లానింగ్ అదిరింది!

నందమూరి బాలకృష్ణ తన వందో సినిమా త‌ర‌వాత కూడా స్పీడు స్పీడుగా సినిమాలు చేయ‌డానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకొంటున్నారు. 'గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి' చిత్రం 2017 సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఆ వెంట‌నే 101వ చిత్రమూ ప‌ట్టాలెక్కిస్తార‌ట‌. ఆ సినిమా దాదాపుగా కృష్ణ‌వంశీతోనే ఉంటుందని టాక్‌. బాల‌కృష్ణ,, కృష్ణ‌వంశీల క‌ల‌యిక‌లో వందో చిత్రంగా 'రైతురాజ్యం' అనే సినిమా తెర‌కెక్కుతుంద‌ని కొద్దిరోజుల క్రింద‌ట ప్ర‌చారం జ‌రిగింది. అయితే కృష్ణ‌వంశీ స్థానం లో అనూహ్యంగా క్రిష్ వ‌చ్చాడు. అయినా స‌రే... కృష్ణ‌వంశీతో తాను అనుకొన్న ప్రాజెక్టుని ఎట్టిప‌రిస్థితుల్లోనూ పూర్తి చేస్తానంటున్నాడ‌ట బాల‌య్య‌. రైతు క‌థ బాల‌య్య‌కు అంత‌గా న‌చ్చింద‌ని, అందుకే కృష్ణ‌వంశీ తో రైతు క‌థ‌ని 101వ సినిమాగా బాల‌య్య తెర‌కెక్కించ‌డానికి సిద్ధ‌మ‌య్యాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల మాట‌. 102వ సినిమాగా బోయ‌పాటి శ్రీ‌ను సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది. అంటే రెండేళ్ల వ‌ర‌కూ బాల‌య్య బిజీ బిజీ అన్నమాట‌. యంగ్ హీరోలకు పోటీగా బాలయ్య ఇలా సినిమాల మీద సినిమాలు చేయడం బాలయ్యకే చెల్లింది..!