English | Telugu

తెలుగు సినిమా సత్తా చూపించిన 'బాహుబలి'

బాహుబ‌లి రికార్డుల ఫ‌ర్వం కొన‌సాగుతూనే ఉంది. భార‌త‌దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న రికార్డుల‌న్నిటినీ ఈ సినిమా కొట్టేసింది. ఫుల్ ర‌న్‌లో పీకే రికార్డుల్ని కొట్టే ఛాన్స్ ఉందా లేదా? అన్న విష‌యం ప‌క్క‌న‌పెడితే .. ఈ సినిమా తొలివారం రికార్డుల్లో అద్భుతాలు ఆవిష్క‌రించింది. బాహుబ‌లి రిలీజై స‌రిగ్గా ఈరోజుకి వారం పూర్త‌య్యింది. రేప‌టి నుంచి రెండో వారంలో అడుగు పెడుతోంది.

ఇప్ప‌టికి ఈ సినిమా భార‌త‌దేశంలో రిలీజైన అన్ని వెర్ష‌న్ల‌లో దాదాపు రూ.255కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప‌న్నుల బాదుడు మొత్తం స‌వ‌రిస్తే రూ.185కోట్ల నెట్ వ‌సూలు చేసింది. ఇంత‌వ‌ర‌కూ ఓ హిందీ సినిమా చేయ‌లేని మ్యాజిక్ ఇది. ఓ ప్రాంతీయ సినిమా సాధించిన అసాధార‌ణ విజ‌యం ఇది. అంతేనా ఈ సినిమా ఇప్ప‌టికే నైజాంలో అదిరిపోయే వ‌సూళ్లు తెచ్చింది. ఏడు రోజుల్లో దాదాపు 21కోట్లు వ‌సూలు చేసి దిల్‌రాజు పెట్టుబ‌డుల్ని వెన‌క్కి తెచ్చేసింది. సోమ‌వారంతో 22కోట్లు దాటుతుంది. అంటే ఇక నుంచి రాజుగారి కి అన్నీ లాభాలేన‌న్న‌మాట‌.

అలాగే అమెరికాలోనూ దాదాపు 6మిలియ‌న్ డాల‌ర్లు (60ల‌క్ష‌ల డాల‌ర్లు ) వ‌సూలు చేసి ఇంత‌వ‌ర‌కూ అక్క‌డ ఉన్న తొలివారం రికార్డుల‌న్నిటినీ కొట్టేసింది. అంతేనా అమెరికా బ‌య్య‌ర్ల‌కు దాదాపు పెట్టుబ‌డికి రెట్టింపు లాభాల్ని అందించింది. ఏపీలో సోమ‌వారం నాటికి చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధ్య‌మ‌వుతుంది. ఇక అక్క‌డినుంచి వ‌చ్చేదంతా రాబ‌డేన‌ని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.