English | Telugu
ఇండియాలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హాలీవుడ్ ఫిల్మ్ గా 'అవతార్-2'!
Updated : Jan 9, 2023
'అవతార్'కి సీక్వెల్ గా జేమ్స్ కామెరాన్ రూపొందించిన విజువల్ వండర్ 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' ఇండియాలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబర్ 16న విడుదలైన ఈ చిత్రం మూడు వారాల తర్వాత కూడా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల జోరు చూపిస్తోంది. అంతేకాదు ఇప్పటికే ఈ చిత్రం ఇండియాలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హాలీవుడ్ చిత్రంగా నిలవడం విశేషం.
2019లో విడుదలైన 'అవెంజర్స్: ఎండ్ గేమ్' రూ.438 కోట్ల గ్రాస్ తో ఇండియాలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హాలీవుడ్ మూవీగా సత్తా చాటగా.. ఇప్పుడు ఆ రికార్డుని 'అవతార్-2' బ్రేక్ చేసింది. ఇప్పటికే ఇండియాలో రూ.454 కోట్ల గ్రాస్ రాబట్టిన 'అవతార్-2' ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఫుల్ రన్ లో రూ.500 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరినా ఆశ్చర్యంలేదని అంటున్నారు.
'అవతార్-2' తెలుగునాట కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం.