Read more!

English | Telugu

ATA వారు సంపూని బండబూతులు తిట్టారట...!

కామెడీ స్పూఫ్ లు చేయడంలో సంపూ తర్వాతే ఎవరైనా. తన పరిచయ చిత్రం "హృదయ కాలేయం"తోనే ఆ విషయాన్ని ప్రూవ్ చేసుకోవడంతోపాటు.. తనకంటూ సపరేట్ స్టార్ డమ్ సొంతం చేసుకొన్నాడు సంపూ. ఆ తర్వాత అతడు నటించిన సినిమాలు అంతగా ఆడకపోయినప్పటికీ.. అతని స్టార్ డమ్ చెక్కుచెదరలేదు. అయితే.. ఇటీవల "అమెరికన్ తెలుగు అసోసియేషన్" (ATA) వారు సంపూని గెస్ట్ గా అమెరికాకు ఇన్వైట్ చేశారు. హ్యాపీగా ఫ్రీగా వచ్చిన బిజినెస్ క్లాస్ టికెట్ తో కాలు మీద కాలేసుకొని మరీ అమెరికా వెళ్లిపోయాడు. మొదట్లో సంపూని రాచమర్యాదలతో సత్కరించిన సదరు నిర్వాహకులు, మరి ఏం తేడా వచ్చిందో తెలియదు కానీ.. సంపూని బండబూతులు తిట్టారట. కారణం ఏంటో చెప్పలేదు కానీ.. సంపూ మాత్రం చాలా ఫీల్ అవుతూ ట్వీట్ చేశాడు. ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు ఈ విషయంలో సంపూని సపోర్ట్ చేస్తున్నారు. అసలు అంత మర్యాదగా అమెరికాకు తీసుకువెళ్లిన ATA వారు అక్కడ సంపూని బండబూతులు తిట్టడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది!