Read more!

English | Telugu

ఇలియానాను చూసి ఆశ్చర్యపోతున్నారు


ఇలియానా చేతిలో "రుస్తుం" అనే హిందీ సినిమా తప్ప మరో ప్రొజెక్ట్ లేదు అందుకే టాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది అని కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ వార్తలు చూసి కోపం వచ్చిందో ఏమో తెలియదు కానీ.. తనకు బాలీవుడ్ లో ఉన్న కాస్తంత పరపతిని ఉపయోగించి ఒక ప్రోజెక్ట్ ను దక్కించుకొంది. అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మీ హీరోలుగా తెరకెక్కనున్న "బాద్ షాహో" చిత్రంలో ఇలియానా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో ఇషా గుప్తా కూడా హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇద్దరిలో ఎవరు మెయిన్ హీరోయిన్ అనేది తెలియాల్సి ఉంది. కాగా.. ఇక ఇలియానా కెరీర్ ఖతం అనుకొనే టైమ్ కి ఇలా ఓ భారీ ప్రొజెక్ట్ సైన్ చేసి తన సత్తా చాటుకొన్న ఇలియానాను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు!