English | Telugu

టాలీవుడ్ లో అనుష్క నామ జపం!!

''సైజ్ జీరో’ ఆడియో ఫంక్షన్లో యూనిట్ సభ్యులు, అతిథులు అందరిదీ ఒక్కటే మాట.. అనుష్క లాంటి హీరోయిన్ని ఇంతవరకు చూడలేదు. శ్యాప్ ప్రసాద్ రెడ్డి అయితే ఐదు నిమిషాల పాటు ఆపకుండా అనుష్కను పొగిడాడు. ‘‘తెలుగులో ఓ డిఫరెంట్ కమర్షియల్ సినిమా చేయాలంటే అనుష్క తప్ప మరో ఛాయిస్ లేదు. అరుంధతి సినిమా విషయంలో కోడి రామకృష్ణకు అనుష్క తప్ప ఇంకెవరూ కనిపించలేదు. బాహుబలి విషయంలో రాజమౌళికి - రుద్రమదేవి విషయంలో గుణశేఖర్ కు ఇప్పుడు సైజ్ జీరో విషయంలో ప్రకాష్ కోవెలమూడికి అనుష్కే ఛాయిస్ అయ్యింది. అనుష్క తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోతుంది. మనం ఎన్నో ఏళ్ల పాటు ఆమెను గుర్తుంచుకుంటాం. అనుష్క చాలా గ్రేట్ ఆర్టిస్ట్. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం. అరుంధతి సినిమా ఇంటర్వెల్ కు ముందు అలా నడిచొస్తుంటే చాలు ఆమె డైలాగ్ చెప్పకపోయినా అద్భుతంగా అనిపించింది. అంత గొప్ప స్క్రీన్ ప్రెజెన్స్ ఆమెది. అలాంటి నటి ఎక్కడా లేదు. టిపికల్ ఇండియన్ అందం ఆమెది. అలాంటి నటి ఉండటం మన అదృష్టం’’ అంటూ తన జేజెమ్మను ఆకాశానికెత్తేశాడు శ్యామ్.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.