English | Telugu
అజయ్ దేవగణ్ ఇకపై ఏపీ బ్రాండ్ అంబాసిడర్..!
Updated : Apr 12, 2016
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం విభాగానికి బాలీవుడ్ స్టార్ కపుల్స్ అజయ్ దేవగణ్, కాజోల్ నియమితులయ్యారు. ఏపీ ఆహ్వానం మేరకు విజయవాడ వచ్చిన అజయ్ సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. పలు విషయాలపై అజయ్ , చంద్రబాబుతో చర్చించారు. ఈ సందర్భంగా అజయ్ దేవగణ్, కాజోల్ జంటను ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా నియమిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీని ప్రమోట్ చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.