English | Telugu

తెలుగు నేర్చుకుంటున్న హీరోయిన్స్.. చిక్కుల్లో సుమ

సుమ కనకాల..హీరోయిన్ల కంటే ఎక్కువ క్రేజ్‌తో స్టార్‌డమ్ ‌తో దూసుకుపోతున్న స్టార్ యాంకర్. తన చలాకితనంతో అందరికి వినోదాన్ని పంచుతూ టీవీ షోలు, మెగా ఈవెంట్లు ఏదైనా సరే సుమ ఉండాల్సిందే. కేరళ అమ్మాయి అయినా సరే కష్టపడి తెలుగు నేర్చుకుని అచ్చ తెలుగుమ్మాయిలా తెలుగుతో చెడుగుడు ఆడుకుంటుంది. తన స్పాన్ టేనియస్‌తో ఎక్కడుంటే అక్కడ నవ్వులు పూయిస్తుంది. ఒక్క ఇద్దరు ముగ్గురు హీరోలకు తప్ప మిగిలిన స్టార్లందరికీ సుమే కావాలి. అలా ఒంటి చేత్తో షోని నడిపించే సత్తా ఉన్న స్టార్ మహిళ సుమ.

తెలుగు తెరపై తెలుగు హీరోయిన్లు కనపడటం లేదు. ముంబై నుంచో మంగుళూరు నుంచో కొచ్చి నుంచో నాయికలను అప్పు తెచ్చుకుంటుంది తెలుగు చిత్ర పరిశ్రమ. వారి మాత‌ృభాష వేరుకావడం తెలుగులో ఇబ్బందిగా ఉండటంతో చాలా మంది కథానాయికలు కష్టపడి తెలుగు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు అదే సుమకు ప్రాబ్లమ్ తెచ్చిపెట్టబోతుందట..ఇది ఎవరో అన్న మాట కాదు. స్వయంగా సుమ తన నోటితో చెప్పిన మాట.

సాయిధరమ్ తేజ్ నటించిన సుప్రీమ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో అందరి మీద జోకులు వేస్తూ స్టేజ్‌ను హుషారెత్తిస్తోంది సుమ. ఆ టైంలో రాశిఖన్నా మాట్లాడుతున్నప్పుడు నా ప్రక్కన నుంచోకు రాశి..నీ చెక్కు చెదరని అందం చూస్తే..నాది మేకప్ అని తెలిసిపోతుంది. అనడంతో అందరూ ఫక్కున నవ్వేశారు. దీనికి రాశి ఏమైనా తక్కువ తిందా..తెలుగులో కౌంటర్ ఇచ్చి దెబ్బకు దెబ్బ తీసింది. ఎలా రాశి?ఎలా? నువ్వు..తమన్నా..మీరందరూ తెలుగులో మాట్లాడేస్తే..రేపు మా యాంకర్ల పరిస్థితి ఏంటి? మీరే యాంకరింగులు కూడా చేసేస్తారేమో అంటూ జోకేయడంతో మళ్లీ నవ్వులే నవ్వులు. ఇలా తన మీద తనే సెటైర్లు వేసుకుంటూ అమ్మడు యాంకరింగ్ అంటే ఇదే అన్నట్లు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఎంత హీరోయిన్లు తెలుగు మాట్లాడిన సుమకి పోటీ వచ్చేవారే లేరు. సుమ సుమే...నో డౌట్.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.