English | Telugu

పాపం.. అన‌సూయ‌ని బూతులు తిట్టార‌ట‌!

ఈ సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్లు వ‌చ్చాక‌.. సెల‌బ్రెటీల‌కు ప్ర‌శాంత‌త లేకుండా పోయింది. ఫేస్ బుక్ , ట్విట్ట‌ర్‌ల‌ను వేదిక‌గాచేసుకొని సెల‌బ్రెటీలు త‌మ స‌మాచారాన్నంతా ఫ్యాన్స్‌కి ఇవ్వాల‌నుకొంటారు. కానీ కొంత‌మంది అభిమానం మ‌రీ వెర్రి త‌ల‌లు వేస్తుంటుంది క‌దా..?? అందుకే ఫేస్ బుక్ , ట్విట్ట‌ర్‌ల‌లో అస‌భ్య‌మైన కామెంట్ల‌తో చిరాకు తెప్పిస్తుంటారు. ఇలాంటివి టాప్ యాంక‌ర్ అన‌సూయ‌కూ ఎదుర‌య్యాయ‌ట‌. ఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా చెప్పుకొచ్చింది. సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్లో కొంత‌మంది దురాభిమానులు త‌న‌ను బండ‌బూతులు తిట్టేవార‌ట‌. అయితే వాటిని అన‌సూయ ఎప్పుడూ డిలీజ్ చేయ‌లేద‌ట‌. వాళ్ల త‌ప్పు వాళ్లే తెలుసుకొంటారు అని వ‌దిలేసేద‌ట‌. కొంత‌మందికి రిప్లై కూడా ఇచ్చేద‌ట‌. మీ ఇంట్లో ఆడ‌వాళ్ల‌తో మీరు ఇలానే మాట్లాడ‌తారా?? అని తిరిగి స‌మాధానం ఇచ్చేద‌ట‌. దాంతో అవ‌త‌లివాళ్లు కామ్ అయిపోయేవార‌ట‌. అద్దాల మేడ‌మీద రాళ్లు వేయాల‌నుకొంటారు.. బ‌ద్ద‌లైతే అదో ఆనందం వాళ్ల‌కు అలాంటి వాళ్ల‌ని మ‌నం ఏం చేయ‌గ‌లం?? అంటూ తెగ ఫీలైపోతోంది అన‌సూయ‌. సెల‌బ్రెటీ అనేస‌రికి ఇవి కూడా భ‌రించాలి మ‌రి..!!

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.