English | Telugu
రామ్ చరణ్ పై స్పందించిన అనసూయ
Updated : Mar 3, 2016
సోగ్గాడే చిన్ని నాయనా తర్వాత అనసూయ కెరీర్ స్పీడ్ పెరిగింది. తాజాగా రామ్ చరణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వస్తున్న తనీ ఒరువన్ రీమేక్ లో ఒక పాటతో పాటు, పెర్ఫామెన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర అనసూయకు లభించిందని, దానికి అనసూయ కూడా ఓకే చెప్పిందనే వార్తలు హల్ చల్ చేశాయి. తాజాగా ఈ వార్తలపై అనసూయ స్పందించింది. ఇప్పటి వరకూ ఈ సినిమా గురించి నన్ను ఎవరూ కలవలేదంటూ కుండ బద్ధలుకొట్టేసింది. అసలు ఇలాంటి రూమర్స్ ఎలా వస్తాయో అంటూ ఆశ్చర్యపోయింది అనసూయ. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వస్తున్న ఈ రీమేక్ ను అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. తమిళ వెర్షన్లో విలన్ గా చేసిన అరవింద్ స్వామి, తెలుగులో కూడా అదే పాత్రను చేస్తున్నాడు. కాగా ఈ సినిమాకు ' ధృవ ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.