Read more!

English | Telugu

సల్మాన్ ఖాన్ కు లేఖ రాసిన లలితా..!

బాలీవుడ్  హీరో సల్మాన్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. తనను తాను రేప్ కు గురైన మహిళతో పోల్చుకొని వివాదం కొని తెచ్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. సల్మాన్ కొత్త సినిమా సుల్తాన్ . ఇందులో మల్లయోధుడిగా నటించాడు. ఈ అనుభం ఎలా ఉంది? అని ప్రశ్న వేశాడు ఓ రిపోర్టర్. దీనికి ఓ విచిత్రమైన సమాధానం ఇచ్చాడు సల్మాన్. 'షూటింగ్ లో రోజుకు ఆరు గంటలు బరువులు ఎత్తడం, కుస్తీ పట్టడం చేశాను. ఇది నాకు అలవాటే. అయితే  రింగ్ లో తోసుకుంటూ కింద పడడం, నిజంగా ఫైటింగ్ చేయాల్సి రావడం చాలా కష్టంగా అనిపించింది.

షాట్ ముగించుకుని రింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రేప్ కు గురైన మహిళలా ఉండేది నా పరిస్థితి' అని సెలవిచ్చాడు సల్మాన్. అయితే సల్మాన్ ఇలా పోల్చడంతో మండిపడుతున్నారు జనాలు. సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగుతోంది. జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ లలితా దీనిపై ఓ లేఖను రాశారు. ఇది మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని, అసలు సల్మాన్ ఎందుకు ఇలా అనాల్సివచ్చిందో వివరణ ఇవ్వాలని చెబుతూ ఓ లేఖ రాశారు. మరి, దీనిపై సల్మాన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..!