English | Telugu

పవన్ ఫ్యాన్స్‌కి అల్లు అర్జున్ భయపడుతున్నాడా?

గత ఎన్నికల సమయంలో పవన్‌కళ్యాణ్‌, అల్లు అర్జున్‌ మధ్య ఏర్పడిన వివాదం తెలిసిందే. దీనిపై మెగా ఫ్యాన్స్‌ బన్నీని ట్రోల్‌ చేస్తూనే ఉన్నారు. అంతేకాదు, కొన్నేళ్ళుగా ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సోషల్‌ మీడియాలో ఒకరినొకరు దూషించుకుంటూ ఉన్నారు. ఇదిలా ఉంటే.. కొన్ని సందర్భాల్లో పవన్‌కళ్యాణ్‌, బన్నీ కలుసుకోవడం ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకోవడం జరిగింది. ఇద్దరూ కలిసి ఫోటోలు కూడా దిగారు. దాంతో వీరిద్దరి మధ్య అన్నీ సర్దుకున్నాయి అనుకున్నారందరూ.

ఇలా జరిగిన కొన్నాళకే మళ్ళీ ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ మధ్య మళ్ళీ యుద్ధం మొదలైంది. అయితే ఈసారి ఏర్పడిన వివాదం రాజకీయానికి సంబంధించింది కావడంతో అది మరింత ఉధృతమైంది. ఏపీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీకి విజయాన్ని అందించాలని అందరూ ప్రయత్నిస్తుంటే మెగా కాంపౌండ్‌కి చెందిన బన్నీ నంద్యాల వెళ్లి అక్కడి అభ్యర్థిని కలవడం మెగా ఫ్యాన్స్‌కి రుచించలేదు. అంతేకాదు, నాగబాబు వంటి వారు ఓపెన్‌గానే బన్నీని విమర్శించారు. సాయిధరమ్‌తేజ్‌, వరుణ్‌తేజ్‌ వంటి వారు ఇన్‌డైరెక్ట్‌గా తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో పవన్‌, బన్నీ మళ్లీ కలుసుకునే అవకాశం లేదు అని నిర్ధారణకు వచ్చారంతా..

ఇదిలా ఉంటే.. తాజాగా పవన్‌కళ్యాణ్‌పై పాజిటివ్‌ కామెంట్స్‌ చేశారు బన్నీ. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ చేస్తున్న అన్‌స్టాపబుల్‌ షోలో పవన్‌కళ్యాణ్‌ ఫోటో చూపించినపుడు బన్నీ ఇలా స్పందించారు. ‘సొసైటీలో ఎంతో మంది లీడర్స్‌ని, బిజినెస్‌ పర్సన్స్‌ని చూశాను. కానీ, కల్యాణ్‌గారిని చాలా దగ్గరగా చూశాను. ఆయన ధైర్యం అంటే నాకు ఇష్టం. నాకు తెలిసిన వ్యక్తుల్లో చాలా డేరింగ్‌ పర్సన్‌ ఆయన. తన దారిలో తను వెళ్లిపోతారు’ అంటూ పొగడ్తల్లో ముంచెత్తాడు.

బన్నీ చేసిన ఈ కామెంట్స్‌తో ఇద్దరి మధ్యా ఉన్న మనస్పర్థలు తొలిగిపోయినట్టేనని సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ పెడుతున్నారు. మరో పక్క హీరోలంతా ఒక్కటేనని సందర్భం వస్తే ఎంత శత్రుత్వం ఉన్నా కలిసిపోతారని, మధ్యలో ఫ్యాన్స్‌ మాత్రం వారి కోసం యుద్ధాలు చేస్తారని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా వారి కోసం కుమ్ములాడుకోకుండా ఉండాలని సూచిస్తున్నారు. ఈ కామెంట్స్‌తో అంతా సర్దుకుపోదని, వారిద్దరి మధ్య ఉన్న అభిప్రాయభేదాలు సమసిపోవని అభిప్రాయపడుతున్నారు. ఫ్యాన్స్‌ మధ్య జరుగుతున్న వార్‌ని ఆపాలంటే ఈ పొగడ్తలు సరిపోవు అంటూ కామెంట్‌ చేస్తున్నారు. అంతకుమించి ఏదో జరగాలని, దానికి సందర్భం కూడా కలిసి రావాలని అంటున్నారు. మరి ఈ విషయంలో పవన్‌కళ్యాణ్‌, అల్లు అర్జున్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిందే.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.