English | Telugu

చ‌ర‌ణ్ కాద‌న్నాడు.. బ‌న్నీ ఔన‌న్నాడు

రామ్‌చ‌ర‌ణ్‌తో ఓ సినిమా చేయాల‌ని బోయ‌పాటి శ్రీ‌ను ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నిస్తున్నాడు. రెండు మూడు క‌థ‌లు రెడీ చేసుకొన్నాడు కూడా. చిరు, చ‌ర‌ణ్‌ల‌కూ వినిపించాడు. అయితే ఆ ప్రాజెక్టు కార్య‌రూపం దాల్చ‌లేదు. దాంతో లెజెండ్ లాంటి హిట్ త‌ర‌వాత కూడా బోయ‌పాటి ఖాళీగా ఉండాల్సివ‌చ్చింది. ఇప్పుడు మరో మెగా హీరోతో సినిమాని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. ఆ హీరోనే... అల్లు అర్జున్‌. ఔను... బ‌న్నీ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. ఈ విష‌యాన్ని బోయ‌పాటి శ్రీ‌ను కూడా ధృవీక‌రించాడు. వ‌చ్చే యేడాది మార్చిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించ‌నుంది. అల్లు అర్జున్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. మార్చిలో పూర్త‌వుతుంది. ఆ త‌ర‌వాత బోయ‌పాటి శ్రీ‌ను సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. చ‌ర‌ణ్ నో చెప్పిన క‌థే బ‌న్నీ తో తీస్తున్నార‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో టాక్‌. మ‌రి చ‌ర‌ణ్‌, బ‌న్నీ తీసుకొన్న నిర్ణ‌యాల్లో ఏది క‌రెక్టో తెలియాలంటే మ‌రో యేడాదైనా ఆగాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.