English | Telugu

ఆమిర్‌ఖాన్‌ ‘మహాభారతం’లో అల్లు అర్జున్‌.. ఫిక్స్‌ అయినట్టేనా?

ఒకప్పుడు సినిమాలు ఏ భాషకు ఆ భాష అన్నట్టుగానే ఉండేవి. ఎవరి భాషలో వారు సినిమాలు చేసుకుంటూ వెళ్లేవారు. అవసరమైతే ఒక భాషలో హిట్‌ అయిన సినిమాను మరో భాషలో రీమేక్‌ చేసేవారు లేదా డబ్‌ చేసేవారు. ఇప్పుడు స్టార్‌ హీరోల సినిమాలకు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాలు భారీ బడ్జెట్‌తో రూపొందడమే కాకుండా వివిధ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. దాంతో ప్రాంతీయ భాషా చిత్రాల మార్కెట్‌ కూడా బాగా పెరిగింది. ఒక భాషలో రూపొందిన సినిమాను పలు భాషల్లో విడుదల చేస్తుండడంతో ఆయా భాషలకు చెందిన స్టార్‌ హీరోలను కూడా సినిమాలో భాగం చేస్తున్నారు. దాంతో అది అనువాద చిత్రం అనే భావన రాకుండా ఉంటుందనేది దర్శకనిర్మాతల ఆలోచన. ఇటీవలి కాలంలో అలాంటి భారీ సినిమాలు ఎన్నో వచ్చాయి. వాటిలో చాలా భాషలకు చెందిన నటీనటులు నటించారు. ముఖ్యంగా జైలర్‌, సలార్‌, కల్కి, దేవర, విక్రమ్‌ వంటి సినిమాల్లో ఇతర భాషలకు చెందిన హీరోలు కూడా నటించడం మనం చూశాం. భారీ బడ్జెట్‌తో నిర్మించే సినిమాల కోసం ఇలా చేయడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. ఒక దశలో ఒక హీరో సినిమాలో మరో హీరో నటించడం అనేది చాలా అరుదుగా జరిగేది. ఇప్పుడా హద్దుల్ని చెరిపేస్తున్నారు హీరోలు. కొన్ని సినిమాల్లో విలన్‌గా నటించేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

ఇటీవలి కాలంలోని కొన్ని భారీ ప్రాజెక్టుల్లో ఏయే హీరోలు నటిస్తున్నారు అనేది ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా అల్లు అర్జున్‌కి సంబంధించిన ఒక న్యూస్‌ బాగా స్ప్రెడ్‌ అయింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ను ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కలిసారనేదే ఆ వార్త. ముంబాయిలోని ఆమిర్‌ నివాసానికి స్వయంగా వెళ్లిన అల్లు అర్జున్‌ అతనితో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ వార్త ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. దానికి కారణం.. ఇటీవల తను చేయబోతున్న మహాభారతం చిత్రానికి సంబంధించి ఆమిర్‌ఖాన్‌ ఒక అప్‌డేట్‌ ఇచ్చారు. ఇది జరిగిన కొన్ని రోజులకే అల్లు అర్జున్‌ అతన్ని కలవడం వెనుక ఏదో బలమైన కారణం ఉంది అంటున్నారు. మహాభారతం అనేది తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని గతంలోనే ప్రకటించారు ఆమిర్‌ఖాన్‌. అయితే దాన్ని ఈ సంవత్సరం ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. పూర్తి స్థాయి మహాభారతాన్ని తెరకెక్కించాలన్నది ఆమిర్‌ఖాన్‌ ఆలోచన. అందుకే ఈ సినిమాను ఎక్కువ భాగాలుగా నిర్మించే అవకాశం ఉంది. అంతే కాదు, డైరెక్టర్లు కూడా ఎక్కువ మంది ఉంటారని తెలుస్తోంది. ఇండియాలో ఉన్న పెద్ద హీరోలంతా ఈ సినిమాలో భాగమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇప్పటికే పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమిర్‌ఖాన్‌ను అల్లు అర్జున్‌ కలవడం చర్చనీయాంశంగా మారింది. మహాభారతం చిత్రంలో అల్లు అర్జున్‌ నటించబోతున్నాడని, అందులో అతను చేయబోయే పాత్ర గురించి డిస్కస్‌ చేసేందుకే ఇద్దరూ కలిశారు అని చెప్పుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికార ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది తెలియాలంటే కొంతకాలం వేచి వుండక తప్పదు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.