English | Telugu

అల్లు అర్జున్‌కి రానా భయం పట్టుకుంది

రానా పేరు చెబితేనే అల్లు అర్జున్ ఉలిక్కిపడుతున్నాడట. తన స్టార్‌డమ్‌ని రానా ఓవర్‌టేక్ చేస్తాడేమోనని, తాను చేసిన త్యాగం రానా కారణంగా సరైన ప్రతిఫలాన్ని ఇవ్వదేమోననని అల్లు అర్జున్ భయపడుతున్నాడట. శుక్రవారం నాడు విడుదలవుతున్న ‘రుద్రమదేవి’ సినిమాలో రానా ధరించిన చాళుక్య వీరభద్రుడి కేరెక్టర్ తాను ధరించిన గోన గన్నారెడ్డి పాత్రను మించిపోయే ప్రమాదం వుందనే డౌట్‌ అల్లు అర్జున్ని వేధిస్తోందట.

పాపం అల్లు అర్జున్‌‌ని ఈ డౌట్ ఎందుకు వేధిస్తోందంటే.... ‘బాహుబలి’ సినిమాలో హీరో ప్రభాస్ అయినప్పటికీ, విలన్ పాత్రలో నటించిన రానాకే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఆ సినిమాలో ప్రభాస్‌ని రానా ఓవర్‌టేక్ చేశాడనే చెప్పాలి. ‘బాహుబలి’లో ప్రభాస్‌కి ఎదురైన పరిస్థితే ‘రుద్రమదేవి’లో తనకు ఎదురవుతుందేమోనన్న సందేహం తనను వేధిస్తోందని అల్లు అర్జున్ తన సన్నిహితుల దగ్గర వ్యక్తం చేశాడట. పాపం అల్లు అర్జున్ ‘రుద్రమదేవి’ సినిమా కోసం ఎంతో త్యాగం చేశాడు. దాదాపు ఆగిపోయిన ఈ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రని ధరించడానికి అంగీకరించి ఈ సినిమాకి కమర్షియల్‌గా జీవం పోశాడు. ఈ సినిమాని బతికించడం కోసం దర్శకుడు గుణశేఖర్ గతంలో తనకు ‘వరుడు’ లాంటి అట్టర్ ఫ్లాప్ ఇచ్చాడన్న విషయాన్ని కూడా అల్లు అర్జున్ పట్టించుకోలేదు.

అంతేనా, ఈ సినిమాలో నటించడం కోసం అల్లు అర్జున్ పైసా కూడా తీసుకోలేదు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి హెల్పింగ్ నేచర్ చాలా అరుదుగా కనిపిస్తూ వుంటుంది. మరి ఈ సినిమా కోసం అంత సహాయం, త్యాగాలు చేసిన అల్లు అర్జున్‌ని రానా ఓవర్‌టేక్ చేసేస్తే పాపం అల్లు అర్జున్ ఫీలవుతాడు కదా. త్యాగజీవి అయిన తనకంటే రానాకే ఎక్కువ పేరు వచ్చేస్తే బాధే కదా. సరే, ఇప్పుడు ఎవరికి ఎక్కువ పేరు వచ్చిందనేది ముఖ్యం కాదు... ‘రుద్రమదేవి’ సినిమా హిట్టవడం ముఖ్యం.. గుణశేఖర్ పడ్డ శ్రమకు విజయం దక్కడం ముఖ్యం.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.