English | Telugu

మెగాస్టార్‌ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్‌... వైరల్‌ అవుతున్న ఫోటో!

అల్లు అర్జున్‌ లేటెస్ట్‌ సెన్సేషన్‌ ‘పుష్ప2’ కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టిస్తూ, కొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల్లో రూ.829 కోట్లు కలెక్ట్‌ చేసి రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు తీస్తోంది. పెంచిన టికెట్‌ ధరలకు భయపడి కొందరు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇది గమనించిన మేకర్స్‌ సోమవారం నుంచి టికెట్‌ ధరలను బాగా తగ్గించారు. గత నాలుగు రోజులుగా కొన్నిచోట్ల ఖాళీగా ఉన్న థియేటర్లు ఇప్పుడు పుంజుకుంటున్నాయి. దీన్నిబట్టి పుష్పరాజ్‌ తన టార్గెట్‌ను ఈజీగానే రీచ్‌ అయ్యే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.

గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్‌కి మధ్య కోల్డ్‌ వార్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. రోజు రోజుకీ మెగా ప్యామిలీకి, బన్నికి మధ్య దూరం పెరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఓ ఫోటో హల్‌చల్‌ చేస్తోంది. మెగాస్టార్‌ ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్‌.. చిరంజీవి, సురేఖతో కలిసి దిగిన ఫోటో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పుష్ప2 సక్సెస్‌ తర్వాత మెగాస్టార్‌ని అల్లు అర్జున్‌ కలిసిన ఫోటోయేనా ఇది? అనే ఆలోచనలో పడ్డారు. నిజానికి ఇది ఇప్పటి ఫోటో కాదు. పుష్ప చిత్రానికి అల్లు అర్జున్‌కి ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డు వచ్చినపుడు తన భార్య సురేఖతో కలిసి వెళ్ళి బన్నీని అభినందించారు చిరు. అప్పటి ఫోటోను ఇప్పుడు వైరల్‌ చేస్తున్నారు అభిమానులు. అదీ విషయం.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.