English | Telugu

అందాల బొమ్మకు గాయమైంది

బాలీవుడ్ అందాల బొమ్మ అలియా భట్ కు షూటింగ్ లో గాయపడింది. ‘ కపూర్ అండ్ సన్స్’ సినిమాకు సంబంధించి కొన్ని ముఖ్య సన్నివేశాలు తెరకెక్కిస్తున్నప్పుడు ఆమె కుడి భుజానికి గాయమై౦దట. దీంతో వెంటనే యూనిట్ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. గాయం అంత తీవ్రమైనది కాదని, రెండు వారాలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారట. గాయం కారణంగా 'యోగా డే' మిస్సయ్యానని, రెండువారాల్లో కోలుకుంటానని అలియా ట్విట్టర్‌లో రాసుకొచ్చింది.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.