Read more!

English | Telugu

లండన్ లో ఎంజాయ్ చేస్తున్న ఆలియా!

సినిమా హిట్టా? ఫట్టా? అనే విషయం పక్కన పెడితే.. సెన్సార్ ఇష్యూ పుణ్యమా అని కోట్లరూపాయల ఫ్రీ పబ్లిసిటీ దక్కించుకొని, మరీ భారీగా కాకపోయినా ఓ మోస్తరు కలెక్షన్లు సాధించిన సినిమా "ఉడ్తా పంజాబ్". ఈ సినిమాలో నటించిన షాహిద్, కరీనాలకంటే కాస్త ఎక్కువ పేరు సంపాదించుకొన్న నటి ఆలియా భట్. ఈ సినిమాలో ఆమె పోషించిన పింకీ పాత్రకు విశేషమైన ఆదరణ లభించింది. ఆమె నటనను మెచ్చుకోనివారు లేరు. విడుదలకు ముందు ఎంత హల్ చల్ చేసినప్పటికీ.. విడుదలైన తర్వాత మాత్రం ఈ సినిమా ఆలియాకు తప్ప ఎవరికీ అంతగా ఉపయోగపడలేదు. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేసేందుకు ఆలియా తన స్నేహితురాలితో కలిసి లండన్ కు పయనమయ్యింది. షారుక్ తో ఆలియా జంటగా నటించిన చిత్రం కూడా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. చూస్తుంటే.. ఆలియా నెస్ట్ స్టార్ హీరోయిన్ ఆఫ్ బాలీవుడ్ గా ఎదిగేలా ఉంది!