Read more!

English | Telugu

వరుణ్ తేజ్ సినిమాను ప్రొడ్యూస్ చేయనంటున్న దిల్ రాజు!

ఇదేమిటి మొన్ననే కదా "వరుణ్ తేజ్-శేఖర్ కమ్ముల" కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నట్లు, ఆ సినిమాలో మలయాళం బ్యూటీ సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేయననం ఏంటని కన్ఫ్యూజ్ అవుతున్నారా? కంగారుపడకండి.. ఇక్కడ మనం చెప్పుకొంటున్నది "వరుణ్-శేఖర్ కమ్ముల" సినిమా గురించి కాదు.. ఇదే బ్యానర్ లో వరుణ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో మొదలవ్వాల్సిన సినిమా గురించి. "ఫీల్ మై లవ్" అనే టైటిల్ ను సైతం ఫిక్స్ చేసిన ఈ సినిమా నుంచి నిర్మాతగా దిల్ రాజు తప్పుకొన్నాడు. ఇప్పటికే వరుణ్ తో ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తుండడమే ఇందుకు కారణం.
అయితే.. వరుణ్ తేజ్ కు వెంకీ చెప్పిన కథ విపరీతంగా నచ్చేయడంతో, ఇంకో ప్రొడ్యూసర్ ను రిఫర్ చేశాడట. మరి ఆ కొత్త ప్రొడ్యూసర్ ఎవరో? ఈ సినిమా సెట్స్ కు ఎప్పుడు వెళుతుందో? తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే!