Read more!

English | Telugu

నిజమైన పాములతో డ్యాన్స్ చేసిన జాక్వలిన్!

అమ్మాయిల్ని అప్పుడప్పుడూ భద్రకాళులతో పోలుస్తుంటారు, అవసరమైతే ఎంతటి సాహసం చేయడానికైనా వెనుకాడరని అలా కంపేర్ చేస్తుంటారు. ఈ విషయంలో బాలీవుడ్ భామ జాక్వాలిన్ ఫెర్నాండెజ్ తాజా ఉదాహరణగా నిలిచింది. మామూలుగా బల్లిని చూసినా భయపడి ఆమడదూరం పరిగెట్టే అమ్మాయిలున్న ఈ రోజుల్లో జాక్వాలిన్ ఏకంగా నిజమైన పైతాన్ లను ఒంటిచుట్టూ వేసుకొని తన తాజా చిత్రం కోసం డ్యాన్స్ చేసింది. జాన్ అబ్రహాం, వరుణ్ ధావన్ హీరోలుగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "డిష్యూమ్". ఈ సినిమాలోని ఓ సూపర్ డ్యాన్సింగ్ నెంబర్ ను కాస్త డిఫరెంట్ గా పిక్ఛరైజ్ చేయాలనుకొన్నాడట దర్శకుడు. మామూలు డ్యాన్స్ మూమెంట్స్ కాకుండా పైతాన్ లతో షూట్ చేద్దామని చెప్పాడట. మొదటలో కాస్త భయపడిన జాక్వలిన్ దర్శకుడి కోరిక మేరకు కాస్త రిస్క్ చేసి పైతాన్ లతో డ్యాన్స్ అదరగొట్టేసిందట.