English | Telugu

అఖిల్‌తోనే ఆడ‌తాన‌న్న అనుష్క‌

హుద్ హుద్ తుపాను బాధితుల‌ను ఆదుకోవ‌డానికి ముందుకొచ్చింది చిత్ర‌సీమ‌. ఈనెల 30న వినోద కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి, వాటి ద్వారా వ‌చ్చిన ఆదాయాన్ని తుపాను బాధితుల‌కు అందివ్వాల‌నుకొంటోంది. ఇందుకు సంబంధించి ఓ ప్ర‌ణాళికా సిద్ధం చేసింది. అందులో భాగంగా చిత్ర‌సీమ క్రికెట్ మ్యాచ్ ఆడ‌బోతోంది. నాలుగు టీమ్‌లు పోటీలో పాల్గొన‌బోతున్నాయి. న‌లుగురు హీరోలు కెప్టెన్లుగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఒక్కొక్క జ‌ట్టులో ఇద్ద‌రేసి క‌థానాయిక‌లు కూడా ఉంటారు. ఓ టీమ్‌కి సిసింద్రీ అఖిల్ నాయ‌క‌త్వం వ‌హిస్తాడు. అఖిల్ మంచి ప్లేయర్‌. సీసీఎల్‌లో బౌండ‌రీలు, సిక్స‌ర్ల‌తో హోరెత్తించాడు. అందుకే అఖిల్ జ‌ట్టులో ఉండ‌డానికి క‌థానాయిక‌లు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. అనుష్క అయితే ''నేను అఖిల్ జ‌ట్టులోనే ఉంటా.. త‌న‌తోనే ఆడ‌తా'' అని ముందే క‌ర్చీఫ్ వేసుకొంద‌ట‌. అనుష్క ఆడ‌డానికి రెడీ అన‌డ‌మే మ‌గ‌ద్భాగ్యం. అందుకే నిర్వాహ‌కులు కూడా అనుష్కని అఖిల్ టీమ్‌లో చేర్చారు. ఈనెల 30న ఈ క్రికెట్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. వాటికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఒక‌ట్రెండు రోజుల్లో తెలిసే అవ‌కాశం ఉంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.