English | Telugu

‘అఖండ 2’ లేటెస్ట్‌ అప్‌డేట్‌.. బాలయ్యతో ఢీ కొట్టనున్న విదేశీ విలన్‌!

నందమూరి బాలకృష్ణతో హ్యాట్రిక్‌ బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చిన ఏకైక డైరెక్టర్‌ బోయపాటి శ్రీను. వీరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్‌, అఖండ చిత్రాలు ఎంత పెద్ద విజయాలు సాధించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబో ‘అఖండ2’తో మరో బ్లాక్‌ బస్టర్‌ కొట్టేందుకు సిద్ధమవుతోంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌ అంటే కన్‌ఫర్మ్‌ బ్లాక్‌బస్టర్‌ అని అభిమానులు తమ మైండ్‌లో ఫిక్స్‌ అయిపోయారు. దానికి తగ్గట్టుగానే బోయపాటి ప్లానింగ్‌ కూడా ఉంది. రెండో హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టే సినిమా మామూలుగా ఉండకూడదని పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. అందుకే ప్రతి విషయంలోనూ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. బోయపాటి టీమ్‌ చాలా కాలంగా ఈ పనిలోనే ఉంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలోని పవర్‌ఫుల్‌ విలన్‌ క్యారెక్టర్‌ కోసం అన్వేషిస్తున్నారు బోయపాటి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్‌ అయిన విలన్‌ కాకుండా కొత్త విలన్‌ అయితే ఫ్రెష్‌గా ఉంటుందని భావిస్తున్నారు. దీని కోసం ఓ ఆడిషన్‌ కాల్‌ కూడా ఇచ్చారు. చైనీస్‌ లేదా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఆర్టిస్ట్‌ కోసం చూస్తున్నామని ఆ ఆడిషన్‌ కాల్‌లో తెలియజేశారు. వయసు 50 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలని కోరుతున్నారు. ఈ ఆడిషన్‌పై ఇండియా ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్‌ పెట్టారు. అలాగే 16 నుంచి 18 సంవత్సరాల వయసున్న ఇండియన్‌ గర్ల్‌ కూడా కావాలని అందులో పేర్కొన్నారు. ఆ అమ్మాయికి ఎంతో ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్‌ ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఇండియాలోని ఏ ప్రాంతం వారైనా ఆడిషన్‌కు రావచ్చని, ఏ భాష వారైనా ఫర్వాలేదని తెలిపారు.

ఇవన్నీ చూస్తుంటే ‘అఖండ2’ కోసం బోయపాటి మాస్టర్‌ ప్లానే వేస్తున్నారని అర్థమవుతోంది. బాలయ్యతో చేసిన మూడు సినిమాల కంటే ఈ సినిమాని ప్రెస్టీజియస్‌గా భావిస్తున్నారనిపిస్తుంది. అందుకే ప్రతి విషయంలోనూ ఎంతో కేర్‌ తీసుకుంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ఫైనల్‌ స్టేజ్‌లో ఉందని తెలుస్తోంది. నందమూరి అభిమానులు ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలతో ఉన్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే బోయపాటి సరికొత్త ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారు. మొదటి మూడు చిత్రాలతో చరిత్ర సృష్టించిన నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను.. ఇప్పుడు ‘అఖండ2’ చిత్రంతో సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.