English | Telugu

ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్‌ కన్నుమూత

ప్రముఖ సినీ నటుడు ఆహుతి ప్రసాద్‌ కన్నుమూశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూఈ రోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఆహుతి ప్రసాద్‌ ఈ రోజు కన్నుమూశారన్న వార్తతో ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆహుతి ప్రసాద్‌ అసలు పేరు అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్‌.‘ ఆహుతి’ సినిమాతోని అతని నటనకు మంచి గుర్తింపు లభించింది. అప్పటినుంచి ఆహుతి ప్రసాద్‌గా సినీ పరిశ్రమలో స్థిరపడిపోయారాయన . ఆహుతి ప్రసాద్‌ నటించిన చివరి చిత్రం రుద్రమదేవి.