English | Telugu

Aditya 369 : ఆల్‌టైమ్ క్లాసిక్‌ 'ఆదిత్య 369' రీ రిలీజ్!

భారత సినీ చరిత్రలో మొదటి టైమ్ ట్రావెల్ చిత్రం 'ఆదిత్య 369'. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్, 1991లో విడుదలై తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించి, బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసింది. అప్పట్లో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సినిమా చేయాలనే ఆలోచనే అద్భుతం అంటే, ఆ ఆలోచనను అంతే అద్భుతంగా తెర మీదకు తీసుకొచ్చారు సింగీతం. 'ఆదిత్య 369' సినిమాకి బాలయ్య నటన ప్రధాన బలంగా నిలిచింది. ముఖ్యంగా శ్రీ కృష్ణదేవరాయ పాత్రలో బాలకృష్ణను తప్ప మరెవరినీ ఊహించలేము అనేంతలా ఆ పాత్రకు ప్రాణం పోశారు. వెండితెరపై అద్భుతం సృష్టించిన ఈ చిత్రం, మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. (Nandamuri Balakrishna)

మహా శివరాత్రి నాడు 'ఆదిత్య 369' టీం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమాని 4Kలో రీ-రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది వేసవిలోనే ఆదిత్య 369 సినిమా మళ్ళీ థియేటర్లలో అలరించనుంది. రిలీజ్ డేట్ ని ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. (Aditya 369 4K)

'ఆదిత్య 369' గురించి ఈ తరం వారికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ, అప్పట్లో ఈ సినిమా ఒక వండర్. ఈ తరం వారు ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూసినా.. అప్పట్లో టెక్నాలజీ పెద్దగా లేని సమయంలో, ఇంత గొప్పగా సినిమా తీశారా అని ఆశ్చర్యపోవడం ఖాయం. మరి 'ఆదిత్య 369' మూవీ రీ రిలీజ్ లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.