English | Telugu
'అత్తారింటికి..'అక్కడా రెస్పాన్స్ బాగుంది
Updated : Jun 8, 2015
అత్త - అల్లుడు.. ఈ కాన్సెప్ట్‌తో గతంలో వచ్చిన చిత్రాలన్నింటికి భిన్నంగా రూపొందిన సినిమా 'అత్తారింటికి దారేది'. అత్తతో వెకిలి చేష్టల సన్నివేశాలు, అలాంటి నేపథ్యంలోనే సాగే పాటలు.. ఇవేవి లేకుండా ఈ మూవీ తెరకెక్కి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మేనత్తని అమ్మ తరువాత అమ్మగా భావించే ఓ యువకుడి కథగా రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. తాజాగా కన్నడంలోకి 'రన్న' పేరుతో రీమేక్ అయి రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ పాత్రలో 'ఈగ' ఫేం సుదీప్ నటించిన ఈ సినిమాలో అత్తగా మధుబాల నటించింది. హీరోయిన్ల పాత్రల్లో రచితా రామ్, హరి ప్రియ నటించారు. గత శుక్రవారం విడుదలైన 'రన్న' రికార్డు స్థాయి కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోందని అక్కడి ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.