English | Telugu

సల్మాన్ చేతిలో నితిన్ హీరోయిన్..!

క్షణం మూవీతో కెరీర్లో చాలాకాలంగా ఎదురుచూస్తున్న హిట్ ను ఖాతాలో వేసుకుంది అదాశర్మ. ఇప్పటికే ఇండస్ట్రీకి వచ్చి దాదాపు దశాబ్దం తాకుతున్నా, సరైన హిట్టు మాత్రం క్షణం సినిమా మందు వరకూ ఈ అమ్మడికి లేదు. నితిన్ తో హార్ట్ ఎటాక్ అలా ఇలా ఆడింది తప్పితే, పెద్ద అవకాశాలు కూడా తీసుకురాలేకపోయింది. అయితే క్షణం సినిమాతో అదా జాతకం మారినట్టుంది. ఈ సినిమా తెలుగులో విమర్శకుల ప్రశంసలతో పాటు, మంచి కలెక్షన్లు కూడా సాధించింది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి సాజిద్ నదియావాలా రైట్స్ తీసుకున్నాడు. సినిమా నచ్చడంతో సల్మాన్ ఖాన్, ఈ రీమేక్ లో చేయడానికి ఆసక్తి చూపించాడు. సినిమాలో సల్మాన్ సరసన మాజీ ప్రియురాలిగా మొదట సంగీతా బిజిలానీని తీసుకోవాలనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం, ఒరిజినల్ లో చేసిన అదాశర్మనే ఈ పాత్రకు తీసుకోవాలని భావిస్తున్నారట. హీరోయిన్స్ ను ఇంట్రడ్యూస్ చేయడంలో గోల్డెన్ హ్యాండ్ అని సల్మాన్ కు పేరుంది. సల్మాన్ ఎంకరేజ్ చేసిన చాలామంది హీరోయిన్స్ మంచి పొజీషన్ లో ఉన్నారు. దీంతో ఇప్పుడు అదా శర్మ కూడా తన ఫేట్ మారుతుందని భావిస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సరసన ఈ అవకాశం, డల్ గా ఉన్న తన కెరీర్ కు మంచి మలుపు ఇస్తుందని అదా నమ్మకం.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.