Read more!

English | Telugu

ప‌వ‌న్‌ హీరోయిన్ కు ఏమైంది?

ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ కు ఏమైంది? ట‌్విట్ట‌ర్లో కొత్త‌గా పోస్ట్ చేసిన ఆ ఫోటో ఎందుకు అలాగుంది? పొడవాటి జుట్టుతో వుండే రేణూ ఇలాగైందేంటి? లేటెస్ట్ ఫోటో చూసిన రేణూదేశాయ్ అభిమానుల‌కు ఈ అనుమానాలు రావ‌డం స‌హ‌జం. అయితే ఇది ఒక సామాజిక ల‌క్ష్యం కోసం చేసింద‌ని రేణూ స్ప‌ష్టం చేసింది.

క్యాన్స‌ర్ రోగుల‌కు కోసం జుట్టు దానం చేసే కార్య‌క్ర‌మాన్ని ప్రోత్స‌హించేందుకే ..త‌న జుట్టును కట్‌ చేసిన ఫోటోలు ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశాన‌ని చెబుతోంది రేణూదేశాయ్‌.దాతలు ఇచ్చిన జుట్టుతో విగ్గులు తయారు చేసి.. నిరుపేద కేన్సర్‌ బాధితులకు అందజేస్తోందీ ‘హెయిర్‌ ఫర్‌ హోప్‌’అనే స్వ‌చ్ఛంద సంస్థ‌.రేణు దేశాయ్ కూడా త‌న జుట్టును క‌ట్ చేసి ఈ సంస్థ‌కే అంద‌జేసింది. జుట్టు దానం చేసేందుకు మ‌హిళ‌లు ముందుకొచ్చేలా చైత‌న్యం చేసేందుకు త‌న ఫోటోను పెట్టిన రేణుదేశాయ్ ని అంద‌రూ అభినందిస్తున్నారు.